కల్పిక గణేష్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కల్పిక గణేష్ కన్నా కూడా చాలామంది ముద్దుగా మహేష్ బాబు మరదలు పిల్ల అంటూ పిలుచుకుంటూ ఉంటారు.  దానికి కారణం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో ఈమె హీరోయిన్ సమంత సిస్టర్ గా నటించింది . సినిమాల్లో చాలా చక్కగా నటించి ఆకట్టుకునింది. ఆ తర్వాత కల్పిక గణేష్ పలి సినిమాలలో నటించి మంచి క్రేజీ స్థానాన్ని దక్కించుకుంది.  కానీ కొన్ని కొన్ని సార్లు ఆమె తన పర్సనల్ విషయాలు కారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూ ఉంటుంది .


తాజాగా ఓ రిసార్ట్లో ఆమె సృష్టించిన హంగామా అంతా అంతా కాదు . సోమవారం మధ్యాహ్నం రిసార్ట్ కు ఒంటరిగా వచ్చిన కల్పిక రిసెప్షన్ వద్ద సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రిసార్ట్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెనూ కార్డు అలాగే రూమ్ తాళాలను ముఖంపై విసిరేసినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  అంతేకాదు "సిగరెట్స్ ఏదిరా"  అంటూ సిబ్బందిపై కోప్పడుతూ ఊగిపోయారు . బూతులు కూడా తిట్టారు.దాదాపు 40 నిమిషాల పాటు నానా హంగామా సృష్టిస్తూ రచ్చ రచ్చ చేసింది  కల్పిక .



ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో కల్పిక తన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది . "తాను ఎలాంటి తప్పు చేయలేదు అని రిసార్ట్ సిబ్బంది తాను అడిగిన చిన్న విషయాలను కూడా పట్టించుకోకుండా ఇబ్బందికి గురి చేశారు అని ఆమె ఆరోపించింది . ఈ ఘటనపై ఆమె తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కస్టమర్ గా అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం మర్యాద , సరిగ్గా స్పందన ఇవ్వకపోతే ఎలా అంటూ ఆమె మండిపడింది".  అయితే నెటిజన్స్ దీని పట్ల భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు . రెస్పాన్స్ ఇవ్వకపోతే బూతులు తిట్టాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు . నువ్వు ఏమన్నా తోపైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా..? నీ ఫేస్ కి అంత సీన్ లేదు అంటూ ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు మహేష్ మరదల పిల్లగా పాపులారిటీ సంపాదించుకున్న నటి కల్పిక గణేష్ పేరు మారుమ్రోగిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: