చిత్ర పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఎంతో కొంత ఉండాలి. అప్పుడే టాప్ స్టార్స్ గా ఎదగలరు. లేదంటే కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఆ కొవకే చెందుతాడు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన రామ్ యాక్టింగ్ పరంగానే కాకుండా లుక్‌ పరంగా, డాన్స్ పరంగా కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా టైర్ 2 హీరోల లిస్టులోనే ఉండిపోయాడు.


అయితే బ్యాడ్ లక్‌కు రామ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదో ఒక రీజ‌న్ తో రామ్ చాలా ప్రాజెక్టులను రిజెక్ట్ చేశాడు. ఇవన్నీ అతని స్టార్డ‌మ్ ను పెంచేవే. అలా రామ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ లో `జులాయి` ఒకటి. అప్పటికే వరుస ఫ్లాపుల‌తో కెరీర్ పరంగా అల్లాడిపోతున్న అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన చిత్రమిది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ టాప్ స్టార్స్ చెంత చెరాడు. మ‌రోవైపు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కూడా జులాయితోనే ఫామ్‌లోకి వ‌చ్చాడు.


నిజానికి జులాయి రామ్ చేయాల్సిన మూవీ. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ మూవీ స్టోరీని రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ కి వినిపించారు. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింది. రామ్ ను హీరోగా పెట్టి సినిమా తీయాల‌ని భావించారు. కానీ అప్ప‌టికే రామ్ ప‌లు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి అయ్యే స‌రికి ఆల‌స్యం అయ్యేలా ఉండ‌టంతో త్రివిక్ర‌మ్ మ‌రో ఆలోచ‌న లేకుండా అల్లు అర్జున్ తో జులాయి కథని ముందుకు తీసుకెళ్లారు. 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: