తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా… అమీషా పటేల్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్‌తో చేసిన బద్రి, మహేష్ బాబుతో చేసిన నాని. తెరపై తన అందం, గ్లామర్‌తో యూత్‌కి దిమ్మతిరిగే క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం ఓ సెన్సేషన్‌గా నిలిచింది. హృతిక్ రోషన్‌తో చేసిన ‘కహో నా.. ప్యార్ హై’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. వెంటనే వచ్చిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథా’ ఇండస్ట్రీ హిట్‌తో టాప్ రేంజ్‌లోకి వెళ్లిపోయింది.


కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే అమీషా వ్యక్తిగత జీవితం మాత్రం వరుస వివాదాలతో నిండిపోయింది. మొదటగా డైరెక్టర్ విక్రమ్ భట్‌తో అమీషా ప్రేమలో పడింది. అయితే అతను అప్పటికే మ్యారెడ్ కావడం పెద్ద వివాదమే అయ్యింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ ప్రేమ చివరికి చేదుగా ముగిసింది. "అది నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు" అని అమీషా తానే తర్వాత ఒప్పుకుంది. ఆ తర్వాత లండన్ బిజినెస్‌మ్యాన్ కనవ్ పూరితో రిలేషన్‌లోకి వెళ్లి, రెండు సంవత్సరాల తర్వాత "కెరీర్ ముఖ్యం" అంటూ బ్రేకప్ చెప్పేసింది.



ఇక నిర్మాత కునాల్ గూమర్తో సంబంధం, అతని భార్యతో ఒకే ఇంట్లో ఉండటం వంటి వార్తలు అప్పట్లో బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. కానీ అమీషా ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. మధ్యలో పారిశ్రామికవేత్త నెస్ వాడియాతో పేరు వినిపించినా, "మేం జస్ట్ ఫ్రెండ్స్" అంటూ రూమర్స్‌కి బ్రేక్ వేసింది. ఇటీవల మాత్రం అమీషా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దుబాయ్ ట్రిప్లో యంగ్ బిజినెస్‌మ్యాన్ నిర్వాన్ బిర్లా ఒడిలో కూర్చున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇద్దరూ ఒకే రంగు డ్రెస్ వేసుకోవడం, అమీషా లవ్ ఎమోజీలు పెట్టడం, నిర్వాన్ ‘లవ్యూ’ అంటూ రిప్లై ఇవ్వడం రూమర్స్‌కి మరింత వేడి పుట్టించింది. కానీ నిర్వాన్ మాత్రం "మేం జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఓ మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ కోసమే కలిశాం" అంటూ క్లారిటీ ఇచ్చాడు.



అంతా పక్కన పెడితే – కెరీర్‌లో అమీషా లేటెస్ట్ గేమ్‌చేంజర్ ‘గదర్ 2’. 2023లో విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన అమీషా, అదే పాత క్రేజ్‌తో బాక్సాఫీస్ మీద తన స్టామినా చూపించింది. ప్రేమ విషయానికి వస్తే – ఎన్నో లవ్ ఫెయిల్యూర్స్ చూసినా, "నిజమైన ప్రేమ మీద నాకింకా నమ్మకం ఉంది. డబ్బు, స్టేటస్ కాదు… నమ్మకం, గౌరవం, ఇంటెలెక్చువల్ కనెక్షన్ చాలా ముఖ్యం" అని అమీషా బహిరంగంగా చెబుతుంది. ఇంకా పెళ్లి కాని ఈ క్యూట్ బ్యూటీ, ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: