ఇటీవలే చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో ఒక ప్రభంజనం సృష్టించిన చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ సినిమాని చూసిన చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. యూట్యూబర్ మౌళి , హీరోయిన్గా శివాని నాగారం ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటి లోకి రాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


తాజాగా ఈ విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ ఈ సినిమా ఈటీవీ విన్  లో రాబోతోందని వార్తలను ఖండించింది. ఇలాంటి నకిలీ వార్తలను ఫోటోలను వ్యాప్తి చేస్తే.. మీ మొబైల్ మీద ఒట్టే అంటూ హెచ్చరించింది. లిటిల్ హార్ట్స్ సినిమా ఓటిటిలో రావడానికి మరింత సమయం పడుతుందంటూ తెలియజేసింది. సాధారణంగా డబ్ల్యూ హీరో, డబ్ల్యూ డైరెక్టర్ సినిమాలకు ఈ రేంజ్ లో సక్సెస్ వస్తూ ఉంటాయి. కానీ లిటిల్ హార్ట్స్ సినిమా నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు మార్క్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. చిన్న సినిమాగా విడుదలై ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం గమర్హం.


ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ఇప్పటికే రూ.40 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగా విడుదలై ఇంతటి విజయాన్ని అందుకోవడం కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ సినిమా బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. సినిమా కంటెంట్ మంచిగా ఉంటే ఆడియన్స్ ఎంతలా అభినందిస్తారో లిటిల్  హార్ట్స్ సినిమా ప్రూఫ్ చేసిందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏ మేరకు కలెక్షన్స్ కాబట్టి ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. మొత్తానికి ఓటిటి పైన చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: