
శర్వానంద్ న్యూ లుక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే, శర్వా కొత్త లుక్ అదిరిపోయింది అంటూ ఆయన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా శర్వానంద్ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. అంతలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శర్వా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఒకప్పటికీ 'నారీ నారీ నడుమ మురారి' అనే సినిమాతో పాటు 'భోగి' సినిమాతో పాటు తన 36వ సినిమాను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం శర్వా 36వ సినిమా అభిలాష్ దర్శకుడిగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. అలాగే, సంపత్ నంది 'భోగి' సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసి తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాడు. అలాగే నారీ నారీ నడుమ మురారి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.