గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్మూవీ లో కీలక పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా నుండి మేకర్స్ ఇప్పటివరకు కొన్ని ప్రచార చిత్రాలనే విడుదల చేసిన అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటికి రావడంతో ఓ చిన్న సెంటిమెంటు వర్కౌట్ అయితే ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందా అని చరణ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... చరణ్ కొంత కాలం క్రితం గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ లో చరణ్ రెండు పాత్రల్లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న పెద్ధి సినిమాలో కూడా చరణ్ రెండు పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దానితో ఎక్కడ గేమ్ చెంజర్ సెంటిమెంట్ పెద్ది సినిమా విషయంలో రిపీట్ అవుతుందో అని కొంత మంది చరణ్ ఫాన్స్ కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: