
అయితే ఓజి సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తోంది. పవన్ తనను అభిమానించే డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన ప్రతి సందర్భంలో ఈ స్టార్ హీరోకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాయి. గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ అత్తారింటికి దారేది సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఓజీ సినిమాతో దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చారు. ఈ మూడు సినిమాలు కలెక్షన్ విషయంలో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశాయి.
పవన్ కళ్యాణ్ ను నిజంగా అభిమానించే ప్రతి దర్శకుడు ఛాన్స్ ఇచ్చిన ప్రతి సందర్భంలో ప్రూవ్ చేసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా భారీ స్థాయిలో లాభాలను అందిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో స్టయిలిష్ గా కనిపించారని నెటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. టెక్నీకల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. మ్యూజిక్ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్న థమన్ బీజీఎమ్ విషయంలోమాత్రం అదరగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకొని బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సాధించాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం పక్కా అని హరీష్ శంకర్ ఈ సినిమాతో ఓజీ రికార్డులను బ్రేక్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.