హీరోయిన్, రియలిస్టిక్ ఎమోషన్స్ ,ఫస్ట్ హాఫ్హీరోయిన్, రియలిస్టిక్ ఎమోషన్స్ ,ఫస్ట్ హాఫ్ వీక్ క్లైమాక్స్ ,అనవసరపు బిల్డప్ సీన్స్

టిప్పు (విశ్వదేవ్) కనీసం ఇంటర్ కూడా పాస్ కాని ఓ కుర్రాడు. తన గ్యాంగ్ తో పిట్టగోడ మీద కూర్చుని అందరి చేత చీవాట్లు తింటారు. అదే టైంలో ఊరికి కొత్తగా వచ్చిన దివ్య (పునర్ణవి)ని చూసి ఇష్టపడతాడు. దివ్య తండ్రి టిప్పు తండ్రి కంటే హయ్యెర్ ఆఫీసర్ అవడంతో టిప్పు దివ్యకు సహాయపడుతుంటాడు. ఇక ఇదే టైంలో అందరికి సమాధానం చెప్పాలని ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తారు. సడెన్ గా ఇక్కడే కథలో ట్విస్ట్.. దివ్యకు అనుకోకుండా టిప్పు సహాయం అవసరమవుతుంది. అది చేయడం వల్ల టిప్పు గ్యాంగ్ కష్టాల్లో పడుతుంది. అసలు దివ్య ఏం చేసింది..? దివ్య కోసం టిప్పు ఏం చేశాడు అన్నది అసలు కథ.  

పిట్టగోడ సినిమాలో పాత్రల మాదిరిగానే నటులు కూడా కొత్తగా ఫ్రెష్ లుక్ తో కనిపించారు. హీరో విశ్వదేవ్ బాగున్నాడు. తనదైన శైలిలో నటించి మెప్పించాడు. అయితే మొదటి సినిమా కాబట్టి అతనిలో కాస్త బెరుకు కనబడింది. ఇక హీరోయిన్ గా పునర్ణవి అదరగొట్టింది. స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి తన రోల్ కు న్యాయం చేసింది. ఇక అల్లరి మూకగా చేసిన కామెడీతో వారందరు కూడా బాగానే అలరించారు.   

ముందుగా దర్శకుడు అనుదీప్ తను చెప్పదలచుకున్న పాయింట్ బాగానే ఉన్నా. అది ఓ సినిమాకు సరిపోయేంత సాగదీయడంలో విఫలమయ్యాడు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కాస్త పర్వాలేదు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త డైరక్టర్ పట్టు తప్పాడు. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక రామ్మోహన్ స్క్రీన్ ప్లే కాస్త ఎఫెక్ట్ కొట్టింది. ఇంకాస్త గ్రిప్పింగ్ తో రాసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఓకే.. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.  
పిట్టగోడ అంటూ వచ్చిన ఈ చిన్న సినిమా సురేష్ ప్రొడక్షన్ నుండి రిలీజ్ అవడం వల్ల ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇక సినిమా డైరక్టర్ అనుదీప్ అనుకున్న పాయింట్ అనుకున్నట్టుగా తెర మీద చూపించినా సరే మధ్య మధ్యలో ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అనుకున్న పాయింట్ చిన్నది కాబట్టి దానికి పై పై మెరుగులు సరిగా దిద్దలేకపోయారు. అయితే నాచురల్ ఎమోషనల్స్ మాత్రం బాగా పండాయి. 


రామ్మోహన్ స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా వర్క్ అవుట్ చేయాల్సింది. కొత్త వారే అయినా సినిమాకు కావాల్సినంత అవుట్ పుట్ అందించారు తమ నటనలో. సినిమా స్టార్టింగ్ లో డైరక్టర్ మంచి మూడ్ తో స్టార్ట్ చేసినా రాను రాను తగ్గించేశాడు. కొన్ని సీన్స్ ల్యాగ్ అయినట్టు అనిపించక తప్పదు. హీరో హీరోయిన్స్ సీన్స్ లో మాత్రం లవ్ ప్రపోజల్ సీన్స్ కాస్త పర్వాలేదు ఆ విషయంలో దర్శకుడి ప్రతిభ కనబరిచాడు. 
 

ఓవరాల్ గా సినిమా ఓ రెగ్యులర్ పాయింట్ తో వచ్చినా కాస్త ఇంటెన్స్ ను క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే ఇదే కథను ఇంకాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి స్క్రీన్ ప్లే టైట్ గా రాసుకుని ఉంటే కచ్చితంగా ఇంకా బాగా వచ్చి ఉండేది. 


Vishwadev Rachakonda,Punarnavi Bhupalam,Anudeep KV,Ram Mohan P,Kamalakharఇదో సాదా సీదా పిట్టగోడ కథే..!

మరింత సమాచారం తెలుసుకోండి: