టాప్ హీరోలు ప్రభాస్ మహేష్ జూనియర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ నటించే సినిమాల బడ్జెట్ కనీసం 3 వందల కోట్ల పై మాటే అంటున్నారు. ఈ టాప్ హీరోలు అంతా పాన్ ఇండియా హీరోలుగా మారడంతో వీటికి ఆల్ ఇండియా వైడ్ లో ఏర్పడ్డ క్రేజ్ తో హీరోల పారితోషికం 75 కోట్ల పై మాటే అని అంటున్నారు. ఇంత భారీ పారితోషికం హీరోలకు ఇచ్చి సినిమాలు తీసే ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నీ తమ సినిమాలకు వచ్చే కలక్షన్స్ తో పాటు ఓటీటీ డిజిటల్ రైట్స్ పై చాల ఆధారపడుతున్నాయి.ఇప్పుడు ఈ విషయాన్ని గ్రహించిన ప్రముఖ ఓటీటీ సంస్థలు పెట్టె కండిషన్స్ కు టాప్ హీరోలతో సినిమాలు చేసే ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడ ఓటీటీ సంస్థలు చెపుతున్న రూల్స్ కు తలఒగ్గ వలసి వస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థలు తాము కొనుకున్న టాప్ హీరోల సినిమాల విడుదల ఈషయంలో నిర్మాతల అభిప్రాయాన్ని గుర్తించకుండా ఆ ఓటీటీ సంస్థలు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తమ ఓటీటీ లో విడుదల చేస్తామని అంటూ టాప్ హీరోల సినిమాల రిలీజ్ కు ఓటీటీ లో ప్రసారానికి వీలైనంత ఎక్కువ గ్యాప్ ఉండేలా చూస్తూ ఉండటంతో టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న నిర్మాతలాకు కూడ తమ సినిమాల రిలీజ్ విషయంలో పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.అంతేకాదు ఒకే నెలలో టాప్ హీరోలకు సంబంధించిన సినిమాల విడుదల ఒకదానిపై ఒకటి పోటీగా ఉండకుండా తాము సపోర్ట్ చేస్తున్న భారీ సినిమాలు నెలాకు ఒక్కటి మాత్రమే విదూడదల అయ్యే విధంగా ఓటీటీ సంస్థలు పక్కా ప్రణాళికతో ముందుకు రానున్న పరిస్థితులలో టాప్ హీరోలతో భారీ సినిమాలు తీస్తున్న సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థలు శాసిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: