మ‌ధ్య‌త‌ర‌గతికి ఓ భారీ శుభ‌వార్త‌. సబ్సిడీయేతర వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ పై రూ.100 తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, ఈ త‌గ్గింపు పెద్ద ఉప‌శ‌మ‌నం అని భావిస్తున్నారు.


ఢిల్లీలో సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 100.50 తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 637 ఉంటుంది. ధరలు తగ్గకముందు సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 737.50.  కాగా సబ్సిడీ కోటా కలిగిన వాళ్లకు ఒక్కో సిలిండర్ రూ. 494.35 ఖరీదు చేస్తుందని, సబ్సిడీ రూపంలో రూ. 142.65ను ఖాతాదారు బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ విపణిలో సానుకూలాంశాలు, డాలర్ - రూపాయి మారకం విలువ తగ్గడంతో సిలిండర్ ధరలు తగ్గినట్టు ఐఓసీ పేర్కొంది. తగ్గిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి అని ఓ ప్రకటనలో పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: