
ఇంటి వద్ద భారీగా బందోబస్తు సెక్యూరిటీనీ ఏర్పాటు చేసారు. ఇప్పటికే పలువురు స్టార్ ఆసుపత్రి వద్దకు రోషయ్య పార్థివదేహాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో కొద్ది సేపు ఉంచిన తరువాత.. ఆసుపత్రిలో ఫ్యాక్ చేసిన తరువాత బంజారాహిల్స్ లో ఉన్న రోషయ్య ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ అభిమానుల సందర్శనార్థం కోసం రోషయ్య మృతదేహాన్ని గాంధీభవన్‌కు తరలించేందుకు కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీనిపై మాత్రం అధికారికంగా ఇంకా క్లారిటీ రాలేదు.
1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు రోషయ్య. గుంటూరు హిందూ కాలేజీలో వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా రోషయ్య ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు, రహదారుల శాఖ, రవాణాశాఖ మంత్రిగా పనిచేసారు కొనిజేటి రోషయ్య. 1991లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా కూడా పనిచేసారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నరోశయ్య.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు రోషయ్య. సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011 వరకు రోశయ్య ఏపీ సీఎంగా వ్యవహరించారు. నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పేర్కొనేవారు పలువురు గుర్తు చేసారు.