అల్పపీడన ద్రోణి ఒడిశా తీరంలో బలపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది..ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది.నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతుండటం తో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో ఏపీ అల్లాడుతుంటే వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఒడిశా-ఏపీ తీరం మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 



రెండు రోజుల క్రితం వరకు ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట వైపు కదిలిన అల్పపీడనం భూమిపైనే ఎక్కువగా కొనసాగుతోందని నాలుగైదు రోజుల పాటు అల్పపీడనంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా కదుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం, రుతు పవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 



ముఖ్యంగా కోస్తా జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి.

కోస్తా జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిసింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, మంగళ వారం అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అనకాపల్లి, పల్నాడు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురం లో మంగళవారం ఉదయం 23.5 మి.మీ. వర్షపాతం, అలాగే కారంపూడి మండలంలో 18.5 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తరకోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావారణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు..జాగ్రత్తగా వుండాలని  హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: