అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర విభజన తరువాత ఈ ఏడాదే ఆలయాలపై దాడులు తక్కువగా జరిగాయని డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆలయాలపై దాడులు ఎక్కువగా జరిగాయని కూడా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ఆయా పార్టీల నాయకులు ఏమంటారో..? ఆలయాల పై దాడుల గణాంకాలు పరిశీలిస్తే టిడిపి అధికారంలో ఉన్న 2015లో 290, 2016లో 332, 2017లో 318, 2018లో 267 ఆలయాలపై దాడులు జరిగాయి.