ఇటీవలే అన్ అఫీషియల్ వైసీపీ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న వాసుపల్లి గణేష్ ప్రజల్లోకి వెళ్తున్నారట.. గతంలో ఉన్న ఒత్తిడి ఇప్పుడు ఆయనకు లేదు.. యన ఇద్దరు కుమారులను వైసీపీలో చేర్చి, ఆయన కూడా ఆ పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. జగన్ నిజంగా గట్స్ ఉన్న నాయకుడంటూ ప్రశంసించిన గణేశ్.. ఆయన కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రజల్లోకి తిరగడానికి ఆలోచించే గణేశ్ వైసీపీ కి మద్దతు ఇచ్చిన తర్వాత తన కార్యక్రమాల స్పీడు పెంచారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. వైసీపీ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం.. టీడీపీ వ్యతిరేకించడమే ఇందుకు కారణం.