ప్రజల్లో ఎలాంటి బలం లేని కాంగ్రెస్ పార్టీ , ఒక్క నాయకుడు కూడా సరిగ్గా లేని కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అధికారంలోకి వస్తున్నట్లు మాట్లాడడం టిఆర్ఎస్ నేతలకు నవ్వు తెప్పిస్తుంది..అంతేకాదు పాసింగ్ క్లౌడ్స్ లాంటి నాయకులూ స్థిరంగా ఉండే గులబి పార్టీ ని విమర్శించడం హాస్యాస్పదం గ ఉంది.. ఇక పోతే తాను అనుకుంది చేసుకుంటూ పోయే కేసీఆర్ తొలిసారి ఓ నిర్ణయం విషయంలో తన మనసు మార్చుకుని తలొగ్గారు.. పార్టీ లో తనదే ఫైనల్ నిర్ణయం గా కెసిఆర్ వ్యవహరించేవారు.. కానీ రైతుల విషయంలో తలొగ్గక తప్పలేదు.. ఇటీవలే తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.