పార్టీ బలోపేతానికి చంద్రబాబు ఇటీవలే కొన్ని చర్యలు చేపట్టారు.. పార్లమెంట్ ఇంచార్జ్ లు నియమించడం, పార్టీ అధ్యక్షుడిని వంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.. ఏపీ లో పార్టీ ఆధ్యక్షుడిని మార్చిన చంద్రబాబు తెలంగాణా లో ఎల్ రమణకు మళ్ళీ పార్టీ పగ్గాలు అందించారు.. అయితే ఇది తెలంగాణా టీడీపీ నేతలకు ఏమాత్రం నచ్చడం లేదు.. వాస్తవానికి తొలిసారి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడే నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారన్న టాక్ బలంగా ఉంది. ప్రతిరోజూ పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు రమణకు లేదన్నది ప్రధాన ఆరోపణ. తనకు తీరిక ఉన్నప్పుడు మాత్రమే పార్టీ కార్యాలయానికి వచ్చి పోతుంటారు.