మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు..