నిన్న దుబ్బాక లో ఎన్నికల పర్వం ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరిదీ పైచేయి సాధించిందో కొన్ని రోజుల్లోనే తెలియనుంది. ముందునుంచి అనుకున్నట్లు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ హవా నే కొనసాగింది అని చెప్పాలి.. హరీష్ రావు ఇక్కడ నెల ముందునుంచి పార్టీ గెలుపునకు కృషి చేశారు.. అంతేకాదు తన సొంత నియోజక వర్గంలా దుబ్బాక లో పర్యటించి ప్రజలను ఆకట్టుకున్నారు.. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో తమదే గెలుపు అన్నట్లు విపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ తామే గెలుస్తామని ధీమాగా చెప్తున్నాయి..