తెలంగాణ లో రోజు రోజు కు బలపడుతున్న బీజేపీ పార్టీ దుబ్బాక లో ఫలితం కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తుంది. అక్కడ తమదే గెలుపు అన్నట్లు మొదటినుంచి చెప్తుండగా ఇతర పార్టీ లు కూడా సైలెంట్ గా ఉండడంతో వారి మాటలకు ఊతమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీ పోటీ లో లేడని చెప్పొచ్చు.. ఆ పార్టీ పోటీలో ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు.. విమర్శలు చేసింది కూడా చాలా తక్కువే.. కానీ బీజేపీ మాత్రం టీఆరెస్ ను చాలా ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ పార్టీ అక్కడ తిష్ట వేసి ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్లాన్ చేసింది.. అయితే దుబ్బాక లో గెలుపు పై టీఆరెస్ కూడా మంచి నమ్మకం పెట్టుకోగా కొన్ని రోజుల్లో ఫలితాలు వచ్చి ఎవరి గెలుపో నిర్ణయిస్తుంది..