దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీన ప్రధాని మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించనున్నామని ప్రకటన చేశారు. కేంద్రం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనలలో సడలింపులు చేయనుంది. కేంద్రం సడలింపులు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం గత నెల నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. 
 
లాక్ డౌన్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకుండా పోయింది. లాక్ డౌన్ ఇలాగే కంటిన్యూ అయితే దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రం పలు రంగాలకు సడలింపులు ఇచ్చింది. రేపటినుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు తెరచుకోవాలని కేంద్రం సూచించింది. అత్యవసర సేవల కోసం ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. 
 
తయారీ యూనిట్ల పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. నిత్యావసర, అత్యవసర సరుకుల కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కేంద్రం థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3వ తేదీ వరకు తెరవకూడదని ఆదేశాలు జారీ చేసింది. మే 3 వరకు బస్ సర్వీసులు, మెట్రో సర్వీసులు లాక్ డౌన్ లోనే ఉంటాయని సమాచారం. 
 
కేంద్రం నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వనుంది. కానీ కార్మికులు నిర్మాణం జరిగే చోటే నివశించాలని నిబంధనలను జారీ చేయనుంది. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదని సమాచారం. ఆస్పత్రులు, మందుల షాపులు తెరవడానికి కేంద్రం అనుమతి ఇవ్వనుంది. మే నెల 3వ తేదీ వరకు మతపరమైన కార్యక్రమాలు, ఫంక్షన్లు, వేడుకలు, ప్రార్థన స్థలాలు క్లోజ్ చేసి ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: