జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుండి బీజేపీ పార్టీతో సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా గతంలో చంద్రబాబు మాదిరిగా బీజేపీ అధిష్టానం పై విమర్శలు చేయకుండా చాలావరకూ తెలివిగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ వచ్చిన టైములో కేంద్ర ప్రభుత్వానికి అనేక నిర్ణయాలు సలహాలు ఇవ్వటం లో కీలక పాత్ర పోషించారు జగన్. దీంతో చాలావరకు ఢిల్లీ బిజెపి నాయకులకు మరియు రాష్ట్రంలో ఉన్న ఏపీ అధికార పార్టీకి మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి అనే అభిప్రాయం బయట ప్రపంచం లో నెలకొంది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో పోషించిన క్రమంలో బీజేపీ జనసేన కాంబినేషన్లో వైసిపి ని ఇరుకున పెట్టడానికి ఢిల్లీ రాజకీయ నేతలు ఆలోచిస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు జగన్ బృందాన్ని జాతీయ స్థాయిలో ఇదివరకులా కాకుండా ఎక్కడికక్కడ కట్టడిచేసే విధంగా వ్యవహరించాలని మోడీ మరియు బిజెపి పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితుల బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గర పడే పరిణామాలు కనబడుతున్న తరుణంలో మోడీ మిగతా బీజేపీ నేతలు జగన్ అండ్ కో బృందని ఢిల్లీలో పెద్ద హైలెట్ అవ్వకుండా దూరం పెట్టాలనుకుంటున్నారు అని ఢిల్లీ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. సరైన రీతిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది అని బీజేపీ పార్టీ అగ్రనేతలతో రాష్ట్రంలో తాజా పరిస్థితులు బట్టి రాష్ట్ర బీజేపీ నేతలు చర్చించినట్లు టాక్. దీంతో వైయస్ జగన్ తో ఇదివరకు లాగా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిసైడ్ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: