ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇవ్వడం టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా అలవాటు. మొదటినుంచి బాబు ఇదే రకమైన రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దారుణమైన పరిస్థితుల్లో కి వెళ్లి పోయినా, బాబు ఏదో రకంగా మళ్లీ పార్టీకి పునర్ వైభవం తీసుకు వచ్చే విధంగా ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం పార్టీలో  నాయకుల వలసలు వంటి వ్యవహారాలతో టిడిపి నేతల్లో భయం ఆందోళన నెలకొంది. తెలుగుదేశం పార్టీకి అధికారం రానున్న రోజుల్లో దొరకడం కష్టమేనని అభిప్రాయము ఆ పార్టీ నేతల్లో వచ్చేసింది. సరిగ్గా ఇదే సమయంలో బాబు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూ, కమిటీలను పార్టీలో నియమించి పార్టీలో ఉత్సాహం రేకెత్తించారు. 


అయితే గతం కంటే భిన్నంగా ఈసారి కమిటీల నియామకం బాబు చేపట్టారు.మిగతా అన్ని విషయాలు పక్కనపెట్టి విధేయత, నమ్మకానికి పెద్దపీట వేశారు. మరీ ముఖ్యంగా నందమూరి కుటుంబానికి చెందిన బాలకృష్ణకు పొలిట్బ్యూరోలో అవకాశం కల్పించడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. అలాగే ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళి వచ్చిన మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కు బాబు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అలాగే ఓ హత్య నేరం చేసిన జైలు కి వెళ్లి, బెయిల్ పై బయటకు వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కు కీలక పదవి అప్పగించారు.




 కానీ గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చిన వారిని పూర్తిగా పక్కన పెట్టే వారు. కానీ ఇప్పుడు అటువంటి వారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు.  ఈ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని బాబు ఫాలో అయినట్టు గా కనిపిస్తున్నారు. నమ్మిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది రాజశేఖర్ రెడ్డి స్టైల్.అలాగే నందమూరి కుటుంబానికి చెందిన బాలయ్యకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, ఆయన ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకుంటారు అని అనుకున్నా, ఇప్పుడు బాబు ఆయనకి తొలి అవకాశం కల్పించడంతో పాటు,  అదే నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి సుహాసిని కి తెలంగాణలో పదవి ఇవ్వడం అందరిన ఆశ్చర్యానికి గురి చేసింది. లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ కూర్పు చేసినట్లుగా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: