మన దేశంలో ఇప్పుడు కరోనా వ్యాప్తి దాదాపుగా అదుపులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా  వ్యాప్తి మరింతగా  పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరోనా రెండో వేవ్ గనక మొదలైతే ఎలా దానిపై చాలావరకు జాగ్రత్త వహిస్తుంది. ప్రధానంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, గుంటూరు, నెల్లూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే రాష్ట్రం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీఎం జగన్ కూడా ఇప్పుడు కరోనా రెండో వేవ్ మొదలైతే ఎలా వ్యవహరించాలి అనే దాని పై అధికారులకు పలు సూచనలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పుడు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అప్రమత్తం అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ బృందాలను అదేవిధంగా వైద్య పరికరాలను అలాగే కరోనా టెస్ట్ కిట్స్ ని ఎక్కువగా పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ మేరకు నిధులు ఇవ్వటం లేకపోతే కనుక పరికరాలను పంపించడం ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో మరి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: