నేటి రోజుల్లో రాజకీయాలు వలస రాజకీయా లుగా మారి పోయాయి ఎందుకంటే పదవుల కోసం, రాజకీయ మనుగడ కోసం ఒక పార్టీ నుంచే ఇతర పార్టీల లోకి జంప్ అవుతున్న వారు ఎక్కువ  వుతున్నారు. కానీ నేటి రోజుల్లో ఒకే పార్టీని అంటి పెట్టుకొని పదవుల కోసం ఆశించ కుండా ప్రజల తరఫున పోరాడుతున్న వారు మాత్రం చాలా తక్కువ గానే కనిపిస్తున్నారూ. వారు వీరు అనే తేడా లేదు సమయం వచ్చినప్పుడు అందరూ కూడా వలస రాజకీయం వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి వలసలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయ్. ఓడిన పార్టీ నుంచి గెలిచిన పార్టీలోకి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు.



 అయితే నాయకులు నమ్ముకుని ఓటేసిన జనాలు మాత్రం  జంపింగ్ నాయకులను చూసి షాక్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు ఇక వలస వెళ్ళిన తర్వాత నాయకులు ప్లేటు ఫిరాయించడం చూస్తే మాత్రం ఇక రాజకీయ నాయకుల కంటే గొప్ప నటులు ఎవరూ ఉండరేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ లో ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు.. మా పార్టీ కంటే గొప్ప పార్టీ లేదని ప్రజలకు న్యాయం చేస్తుంది అని చెబుతూ ఉంటారు.



 కానీ వేరే పార్టీ లోకి వెళ్లిన తర్వాత మాత్రం ఎందుకో అప్పుడు వరకు ఏళ్లపాటు రాజకీయ మనుగడ సాగించిన పార్టీపైనే తిట్ల పురాణం మొదలు పెడుతూ ఉంటారు.. అంతే కాదు అప్పటివరకు తిట్టిపోసిన పార్టీని పొగడ్తల తో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారూ. ఇలా పార్టీ ఫిరాయించిన తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు అందర్నీ కూడా ఒక్కసారిగా నోరెళ్ళ  బెట్టేలా చేస్తూ ఉంటాయి. ఏదేమైనా ఇటీవల కాలంలో వలస రాజకీయాల ట్రెండ్ మాత్రం జనాల్ని కన్ఫ్యూషన్ లో పడేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: