ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా చాలామంది నేతలు పలు ప్రాంతాలలో నిలబడి గెలిచినవారు ఉన్నారు. అలా మొదటిసారి నిలబడి గెలిచిన వారిలో అమిలినేని సురేంద్రబాబు కూడా ఒకరు. రాయలసీమలోని కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా అక్కడి కార్యకర్తలకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఈయనకు తృటిలో ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి సురేంద్రబాబు అనంతపురం వస్తూ ఉండగా బాగేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ప్రయాణిస్తున్న ఆయన కారు ఒక లారీని ఓవర్ టెక్ చేస్తూ ఉన్న సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టిందట. దీంతో ఈ విషయం తెలిసిన అటు నేతలు కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారు.


అయితే ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. సురేంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. అయితే ఆయనకు ఏమీ కాలేదని విషయం తెలియగానే కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు..ముఖ్యంగా తన నియోజకవర్గంలో కూడా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మంచి పేరు సంపాదించారు. 2024 శాసనసభ ఎన్నికలలో  37వేల ఓట్లతో గెలిచారు. అయితే అలాగే భైరవాణి తిప్ప నీటిపారుదల ప్రాజెక్టును సైతం తాను గెలిచిన వెంటనే రెండేళ్లలో పూర్తి చేస్తానంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు.


ఇక ఈ టీడీపీ ఎమ్మెల్యే చదివింది కేవలం పదవ తరగతి మాత్రమే నట.. ఈయన ఆస్తి కూడా సుమారుగా అఫీడవిట్లో 189 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలియజేశారు. ఇక కళ్యాణ్ దుర్గానికి సంబంధించిన అన్ని పనులను తానే దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందే ఆ ప్రాంతంలో ఈయన హవ్వ బాగా కొనసాగింది.రాయలసీమలో అత్యధికంగా పేరు పొందిన ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు ఆమిలినేని సురేంద్రబాబు. మరి ప్రమాద సంఘటన  పైన టిడిపి ఎమ్మెల్యే  అభిమానులకు  ఎలాంటి విషయం తెలియజేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: