సహజంగానే అధికారంలోకి వచ్చి ఏడాది పాలన తరువాత తమ పనితీరు ఎలా ఉందనే విషయంపై అధికార పార్టీ నేతలు ఒక అంచనా వేసుకుంటూ ఉంటారు. నేతలకు ఏడాది పాలన అంటే తక్కువే అయినా అది ప్రజల దృష్టిలో చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇప్పుడు కూటమి పార్టీ నాయకుల పనితీరు పైన ప్రజలలో ఎలాంటి అంచనాలు ఉన్నాయన్నదే ఇప్పుడు ఏపీ అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నది. ముఖ్యంగా టిడిపి, బిజెపి నేతలు పనితీరు ఎలా ఉన్నప్పటికీ జనసేన నేతల పరిస్థితి కీలకంగా ఉన్నదట.


అందుకు గల కారణాలు ఏమిటంటే గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో పవన్ పైన ప్రజలకు అపారమైన నమ్మకం ఉండేది ఎన్నికల ముందు ప్రజలతో మమేకమైన పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనను తిడుతూ అంతకంటే ఎక్కువ మెరుగైన పాలన అందిస్తామని అభివృద్ధి అంటే ఏదో చూపిస్తామంటూ చెప్పారు. అందుకు సంబంధించిన గతంలో మాట్లాడిన వీడియోలను చూస్తే అది క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే బంధుప్రీతి, అవినీతి లేని రాజకీయాలు చేస్తామంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ నేతలు ప్రజలను ఇబ్బంది పెట్టారనే విధంగా తెలిపేవారు. అలాగే మహిళల భద్రతకు కూడా పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏడాది కాలంలో ప్రజలలో జనసేన పార్టీ ఏ విధంగా అంచనాలు అందుకుందో అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా వ్యక్తులను, రాజకీయాలను, అవినీతి వంటి వాటిని అదుపు చేయడం చాలా తేలికైన విషయమే.. అయితే ప్రజల ఆశలలో కొంతమేరకు మాత్రమే జనసేన పార్టీ సాధించిందని మరిన్ని సాధించాల్సి ఉందనే విధంగా తెలుపుతున్నారు.. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, ఉచిత పథకాలు అందకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఇవ్వకపోవడం అలాగే అక్రమంగా జరుగుతున్న అవినీతి రోజురోజుకి పెరుగుతున్నాయి.. ఇలాంటి విషయాలపైన జనసేన పార్టీ మరింత కృషి చేయవలసిన పరిస్థితి ఉన్నదట. మరి రాబోయే రోజుల్లో ప్రజలలో జనసేన పార్టీ ఎలాంటి బ్రాండ్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: