అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎంతోమంది కుటుంబాలని బలిగొన్నది.వందల మంది కుటుంబాలలో కన్నీళ్లు మిగిల్చింది.చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా దాదాపు 265 మంది మరణించారు. ఇక ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం భద్రతా లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని,విమానయాన సంస్థ నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ విమానం కుప్ప కూలిందంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మరణించిన సంగతి తెలిసిందే.అయితే విజయ్ రూపాని మరణంతో సోషల్ మీడియాలో ఒక వైరల్ వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే అప్పుడు కొడుకు.. ఇప్పుడు తండ్రి.. విజయ్ రూపాని కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతుందా అంటూ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. 

అదేంటంటే..గుజరాత్ కి 16వ సీఎం గా విజయ్ రూపాని 2016 నుండి 2021 వరకు కొనసాగారు. ఇక విజయ్ రూపాని పర్సనల్ విషయానికి వస్తే.. ఆయనకు పెళ్లయి ఓ కొడుకు కూతురు ఉన్నారు. కానీ కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించారు. విజయ్ రూపాని కొడుకు పుజిత్ మరణం తర్వాత కొడుకు పేరుమీద గుర్తుగా పుజిత్ మెమోరియల్ ట్రస్టుని స్థాపించి.. ఆ సంస్థ ద్వారా తనకు తోచిన సహాయం చేస్తూ సమాజ సేవలో మునిగిపోయారు. అయితే విజయ్ రూపాని భార్య కూతురు ఇద్దరు లండన్ లో ఉంటున్నారు. అలా తన భార్య కూతురు ఇద్దరినీ చూసి భార్యను తనతో తీసుకురావడానికి విజయ్ రూపాని లండన్ కి వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. ఆరు నెలల నుండి విజయ్ రూపాని భార్య కూతురు దగ్గర లండన్ లోనే ఉండడంతో తిరిగి ఇండియాకు తీసుకురావడానికి విజయ్ రూపాని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే ఫ్లైట్లో ప్రయాణం చేశారు.

అలా అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే ఫ్లైట్ కూలిపోవడంతో అందులో ఉన్న వాళ్ళందరూ అక్కడికక్కడే మరణించారు. అలా ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మరణించారు. ఇక విజయ్ రూపాని మరణ తో ఆయన సన్నిహితులు,కుటుంబ సభ్యులు అందరూ అప్పుడు కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఇప్పుడు తండ్రి విమాన ప్రమాదంలో మరణించాడు.వీరి కుటుంబానికి ఏదైనా శాపం ఉందా.. ఎందుకు ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు సహజ మరణం కాకుండా ఇలా ఒకరు రోడ్డు ప్రమాదంలో మరొకరు విమాన ప్రమాదంలో మరణించారు అని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: