
రాజ్ కుష్వాహ మొబైల్లో పలు పాస్ వర్డులు ,చినిగిన నోట్ల తో పాటు చాలా లావాదేవీలకు సంబంధించి ఆధారాలు కూడా లభించాయట. ముఖ్యంగా ఇందులో పాత రూ.10 నోట్ల ఫోటోలు కూడా చాలానే ఉన్నట్లు తెలుపుతున్నారు. అయితే వీరు హవాలా లావాదేవీలలో కూడా ఈ నోట్లను ఉపయోగిస్తున్నారని విధంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్ , సోనమ్, గోవింద్ ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని అధికారులు తెలియజేస్తున్నారు. సోనమ్, రాజ్ 50వేల రూపాయలు హాంతకుడికి పంపించారని ఇది హవాలా నెట్వర్క్ గానే ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు
సోనమ్ సోదరుడు గోవిందుతో కలిసి ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. సోనమ్ కుటుంబానికి దగ్గర బంధువు అయినా జితేంద్రతో కలిసి ఈ రహస్య లావాదేవులు సోనమ్ , అతని సోదరుడు గోవిందా జరిపినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారుగా 14 లక్షల రూపాయల వరకు విత్డ్రా, డిపాజిట్లు వంటివి చేసినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి లావాదేవులను ఈడి అధికారులకు కూడా అప్పజెప్పినట్లు తెలుస్తోంది. వీరందరికీ కూడా నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని రాజా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. అలాగే సోనమ్ సోదరుడు సంపద పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయని తెలుపుతున్నారు. రాజా రఘువంశి హత్య కేసులో కూడా.. మొదట ప్రేమ వ్యవహారం ఆ తర్వాత మరొక యువకుడితో ఎఫైర్ ఇలా అందరూ అనుకున్నారు..కానీ ఇప్పుడు హవాలా వ్యవహారం వల్ల రఘువంశీని మర్డర్ చేశారనే విధంగా అనుమానాలు మొదలవుతున్నాయట. మరి అధికారులు ఏం చెబుతారో చూడాలి.