
అయితే ఆయన ప్రధానంగా అప్పటి దేందులురు ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించిన వివాదాల్లో చిక్కుకుని ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు .. అంతేకాకుండా దందాలు వ్యవహారాలంటూ ఎన్నో ఆరోపణలు కూడా తెచ్చుకున్నారు . ఇక దాంతో వివాదాస్పదా ఎమ్మెల్యేగా చింతమనేని రాష్ట్రంలోనే మొదటి ప్లేస్ లో పేరు తెచ్చుకున్నారు .. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ద్వారా ఓటమి పాలయ్యారు .. అలా ఓడిపోయిన తర్వాత ఆయన మీద వైసిపి ప్రభుత్వం లో వరుస కేసులు పెట్టి కొన్ని నెలలు జైల్లో కూడా పెట్టారు .
ఈ క్రమంలో చింతమనేని మరింత రాటు తేలారు .. అయితే ఆయన 2024 ఎన్నికల్లో ఒక ప్రభంజనం లాగా వచ్చి కూటమి వేవ్‌లో భారీ మెజారిటీతో గొప్ప విజయం సాధించారు .. ఇలా మూడుసార్లు గెలిచిన ఆయనకు మంత్రి పదవి మాత్రం అందని దాక్షాలా మిగిలింది .. సీనియర్ నేతగా ఉన్న చింతనయానికి ఆ పదవి దక్కకపోవడానికి ఆయన వైఖరి ప్రధాన కారణమని అంటున్నారు .. ప్రధానంగా ఆయన వివాదాలు తో ఎక్కువ నలిగి ఉండటం వల్లే మంత్రి పదవి అందుకోలేకపోతున్నారని అంటున్నారు .. అయితే హైకమాండ్ నుంచి ఏమైనా సలహా సూచనలు వచ్చాయో లేక సన్నిహితులు ఏమైనా హితబోధ చేశారో తెలియదు కానీ .. ప్రస్తుతం చింతామనేని రాముడు మంచి బాలుడు అన్నట్లుగా పూర్తిగా మారిపోయారని అంటున్నారు ..
ఇప్పుడు ఆయన తీరు పూర్తిగా ఎంతో డిఫరెంట్గా ఉంటున్నారు .. నిత్యం ప్రజల సమస్యల మీదే ఉంటున్నారు .. అలాగే అందరితో బాగా ఉంటున్నారు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు .. అయితే ఇక్కడ ఆయనకు రాజకీయంగా కలిసి వస్తున్న మరో విషయం ఏమిటంటే వైసిపి దెందులూరు ఇన్చార్జ్ అయిన అబ్బయ్య చౌదరి ఏకంగా అమెరికాకు తన ముఖం మార్చేశారు .. దాంతో వైసీపీకి నాయకుడు లేక డేలా పడింది . ఇక దీంతో చింతమనేని ఇదే అదనగా పార్టీని అభివృద్ధి చేస్తున్నారు .. ప్రధానంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు .. ఇలా ఆయన మారిపోవడానికి కారణాలు తెలిసి తెలియక సొంత పార్టీలోనే గట్టి చర్చ నడుస్తుంది.. అయితే చింతమనేని మినిస్టర్ పదవి మీద కన్ను వేశారని . రాబోయే మంత్రి మండలి విస్తరణలో కచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంటున్నారు ..
అంగ బలం అర్థబలం కలిగి ఉన్న చింతనేని వంటి వారు మంత్రి పదవిలో ఉంటే 2029 ఎన్నికల నాటికి గోదావరి జిల్లాలో దూకుడు మరో లెవల్ ఉంటుందని కూడా అంటున్నారు .. అయితే బహుశా హై కమాండ్ కి కూడా చింతమనేని మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చని అందుకే ఆయన్ను నిదానించమని చెప్పి ఉండచ్చని కూడా అంటున్నారు .. అయితే ఏదేమైతేనే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా వివాదాలతో నిలిచే చింతనేని మాత్రం ఇప్పుడు కొంత మౌనముని లాగా తన పని ఏంటో తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు .. ఇక దీంతో చింతమనేని కోరిక నెరవేరబోతుందా అన్న చర్చ కూడా గట్టిగా నడుస్తుంది . అలాగే చింతనని కాబోయే మంత్రి అని అప్పుడే ఆయన అనుచరులు , అభిమానులు ఆనంద పడుతున్నారు .. ఇక మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి ..