
వాస్తవానికి భీమవరంలో ఏర్పాటు కావాల్సిన కలెక్టర్ కార్యాలయాన్ని ఉండిలో ఏర్పాటు అయ్యేలా రఘురామ అడుగులు వేశారు. భీమవరంలో తగినంత భూమి లేదనే కారణం చూపుతూ ఈ విషయంలో రఘురామ కృష్ణంరాజు సక్సెస్ అయ్యారని చెప్పాలి. రఘురామ కృష్ణంరాజు ఏ విషయంలో అయినా మొండిగా ముందుకెళ్తారని తన పంతాన్ని నెగ్గించుకునే విషయంలో ఆయన వెనుకడుగు వేయరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ విషయాలు కూడా వైసీపీ నేతలు చెబితే తప్ప వెలుగులోకి రావడం లేదు. ఇతర నేతలు తన నిర్ణయాన్ని అంగీకరించేలా చేయడంలో సైతం రఘురామ కృష్ణంరాజు సఫలమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికైతే రఘురామ తాను గెలిచినా నియోజకవర్గానికి మేలు చేసే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. రఘురామ తెలివితేటల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
రఘురామ కృష్ణంరాజుపై నమోదైన ఒక కేసు సైతం తాజాగా కొట్టివేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు రఘురామ కృషంరాజుకు అన్ని విధాలుగా కలిసొస్తున్నాయి. రఘురామ కృష్ణంరాజును అభిమానించే వాళ్ళు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు