ఇటీవల కాలంలో భారత దేశ సాంప్రదాయాలు దేశ విదేశాలలో కూడా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో హిందువుల దేవతల, దేవుళ్ల విగ్రహాలు కూడా ఎన్నడు లేనంతగా ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో దేశ విదేశాలలో కూడా చాలా చోట్ల హిందూ దేవుళ్ల ఆలయాలు, విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తయిన రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విగ్రహం ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలిచింది.


ఢిల్లీ, గుర్గావ్ కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నరేష్ కుమార్ ఈ విగ్రహాన్ని చెక్కి పలు భాగాలుగా కెనడాకు తరలించారు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని అమెరికాలో ఉన్న ఇంజనీర్ల బృందం ఒక్కటిగా మలిచింది.శ్రీరాముడి విగ్రహ నిర్మాణం విమానాల తయారీలో తరచుగా ఉపయోగించే ఫైబర్ గ్లాస్ స్టీల్ తో తయారు చేయడం గమనార్హం. ఈ శ్రీరాముడి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ కమిటీ సభ్యులే కాకుండా, రాజకీయ నాయకులతో పాటు మహిళలు, బిజినెస్ మ్యాన్స్, భిన్న రకాల ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.


ఈ విగ్రహ ఏర్పాటుపై హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ఉత్తర అమెరికాలో అతి పెద్ద అయిన శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా గర్వదగ్గ విషయమని తెలియజేశారు. ఈ విగ్రహం సమాజానికి ఒక ఆధ్యాత్మిక బహుమతి ధర్మం ఎల్లప్పుడూ కూడా మన మార్గాన్ని నడిపించాలనే విధంగా గుర్తు చేస్తుందంటూ తెలిపారు . అలాగే పదివేల మందికి పైగా ప్రజల భక్తి ఐక్యతతో కలిసి 50 అడుగుల శ్రీరాముని ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించామంటూ పూజారి ఆచార్య సురేందర్ శర్మ శాస్త్రి వెల్లడించారు. మిస్సిగాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానాలు కూడా ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని తెలియజేశారు. రాముని విగ్రహం అత్యంత ఎత్తైనదిగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: