ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు పాపం ఏమో అయ్యింది. లేకపోతే పంచాయితి ఎన్నికలకు ఎవరైనా మ్యానిఫెస్టో విడుదల చేస్తారా ? అసెంబ్లీ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేశారంటే అర్ధముంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తాము ఏమి చేయబోతున్నామనే విషయాన్ని హామీల రూపంలో ఇవ్వటమే మ్యానిఫెస్టో. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేయబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను మ్యానిఫెస్టోల రూపంలో రాజకీయ పార్టీలు విడుదల చేస్తాయి. మరి పంచాయితి ఎన్నికలకు చంద్రబాబు మ్యానిఫెస్టో విడుదల చేయటమంటే ఏమనుకోవాలి. పంచాయితి ఎన్నికల్లో గెలవటమంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే పంచాయితీ ఎన్నికలనే పార్టీ రహితంగా జరిగేవి. కాబట్టి గెలిచినవారంతా మనవాళ్ళే అని అధికారపార్టీ సింపుల్ గా తేల్చేస్తుంది.
చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో సురక్షితమైన మంచినీటిని అన్నీ పంచాయితీలకు అందిస్తారట. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా కుళాయిలు ఏర్పాటు చేస్తారట. పంచాయితీలను నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతారట. ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు, పవిత్ర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారట. బాలికల విద్యను ప్రోత్సహిస్తారట. గ్రామాల్లోని ప్రతి వీధికి ఎల్ఇడి బల్బులు ఏర్పాటు చేస్తారట. పట్టాభూములు, అసైన్డ్ భూముల కబ్జాకు వీల్లేకుండా చేస్తారట. సరే ఇవన్నీ పంచాయితి ఎన్నికల్లో గెలవగానే చేసేస్తారట చంద్రబాబు. జనాలను పిచ్చోళ్ళని అనుకుంటున్నాడో ఏమిటో అర్ధం కావటం లేదు. పంచాయితి ఎన్నికల్లో గెలిస్తేనే ఇవన్నీ చేస్తానని హామీలిచ్చిన చంద్రబాబుకు అసలు ఇవన్నీ సాధ్యమేనా ? పంచాయితి ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుంది ? చంద్రబాబు చేయాలని అనుకున్నవాటికి ఆమోదం చెప్పాల్సింది రాష్ట్రప్రభుత్వమే కదా. ఎందుకంటే మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ విధానపరమైన నిర్ణయాలే.
నిజంగానే గ్రామాల్లో ఇవన్నీ చేసేయాలన్న చిత్తశుద్దే ఉంటే మరి 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదు ఇవన్నీ ? పంచాయితి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన చంద్రబాబు ఏమీ చేయలేరన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకని మ్యానిఫెస్టో విడుదల చేశారు ? జనాలను పిచ్చోళ్ళని అనుకుంటున్నట్లున్నాడు. తాము అధికారంలో ఉన్నపుడు అది చేశామని, ఇది చేశామని మీడియా సమావేశంలో పెద్ద చార్టులు చూపించారు. చంద్రబాబు పాలన చూసిన తర్వాతే కదా జనాలు ఘోరంగా ఓడించింది ? 2014లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినపుడు జరిగిన ఏకగ్రీవాలకు, 2020లో వాయిదా పడే సమయానికి అయిన ఏకగ్రీవాలను పోల్చి చూపించి మండిపడ్డారు. జగన్ ఏమన్నా పోటుగాడా ? ఇన్ని ఏకగ్రీవాలు ఎలా జరిగాయి ? అంటూ ఊగిపోయారు. మరి జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి టీడీపీ నేతలు ముందుకు రాకపోతే ఎన్నికలు ఏకగ్రీవం కాక మరేమవుతుంది ? కొన్నిచొట్ల గొడవలు కూడా జరిగుండచ్చు. స్ధానిక ఎన్నికలు అవన్నీ సాధారణమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి