తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి టెంపుల్ ఎంతో ప్రఖ్యాతి పొందినది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, అద్భుతమైన చరిత్ర కలది.
దాదాపుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత శక్తివంతమైన గుడిగా ఈ దేవాలయం ప్రసిద్ది చెందినది. పెద్దమ్మ గుడి జూబ్లీ హిల్స్ ప్రాంతానికి గ్రామ దేవతగా ఆరాధిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం కొలువై ఉంది. ఈ దేవాలయానికి ఒక సారి వెళితే చాలు మీ చిరకాల వాంఛలు నెరవేరుతాయి. ఎంత కష్టంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఇక్కడికి వస్తే జీవితంపై కొత్త ఆశ చిగురిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనపై మనకు ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది.  


ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. మనసులో ఉన్న  ఒక కోరికను ఆ పెద్దమ్మ తల్లితో మొరపెట్టుకుని, అక్కడ నేలపై రూపాయి నాణెమును  నిలబడితే మనం కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ   ప్రసాదంగా అందించే పులిహోరను తొలుత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత భక్తులకు ఇస్తారు. పెద్దమ్మ తల్లి స్వయంగా ఆ నైవేద్యాన్ని ఆరగిస్తుందని చెబుతారు. ఈ ఆలయానికి తరచూ భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. అయితే శుక్రవారం నాడు, ఆదివారం, న్యూ ఇయర్ రోజున మాత్రమే భారీ సంఖ్యలో భక్తులు పెద్దమ్మ తల్లి దేవాలయానికి  చేరుకుంటారు.  

రాజకీయ దిగ్గజాలు,  సినీ ప్రముఖులు అందరూ పెద్దమ్మతల్లి ఆలయానికి వచ్చినవారే. హైదరాబాద్ లో అంతగా ఫేమస్ అయింది పెద్దమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయానికి విచ్చేసి మీ కోరికలను పెద్దమ్మతల్లికి చెప్పుకోండి. భక్తి శ్రద్దలతో ఆ పెద్దమ్మతల్లికి పూజలు చేస్తే ఖచ్చితంగా మీ కిరికలు నెరవేరుతాయి. మరి మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి అంతా మంచే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: