ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో బెంగళూరు జట్ల మధ్య జరిగిన పోరు ఎంతో రసవత్తరంగా మారింది. ప్రేక్షకులందరినీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన పోరులో 14 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఒకానొక సమయంలో లక్నో జట్టు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు.


 ఇలాంటి సమయంలోనే హర్షల్ పటేల్ బౌలింగ్ ఎంతో కీలకం గా మారిపోయింది. ఒకవైపు ప్రత్యర్థిని పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాదు కీలకమైన స్టోయినిస్ వికెట్ కూడా పడగొట్టాడు హర్షల్ పటేల్. డెత్ ఓవర్ లలో తాను ఎంత మంచి బౌలర్ అనే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. ఈ క్రమంలోనే హర్షల్ పటేల్ బౌలింగ్ పై ఇటీవలే భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఒక క్రీడా ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హర్షల్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి ఒక సిక్సర్ మాత్రమే ఇచ్చాడు. అతని చేతి వేళ్లకు గాయాలున్న బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అది కూడా పక్కన పెడితే హర్షల్ పటేల్ ఎవరికి బౌలింగ్ చేస్తున్నాడు.. తన ముందున్న ది మ్యాచ్ విన్నర్ వంటి కె.ఎల్.రాహుల్.. అతను అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు అంటూ మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.


 హర్షల్ పటేల్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. కొన్ని బంతులు వృధాగా పోయాయి. ఈ క్రమంలోనే కొన్ని తక్కువ వేగంతో కూడిన బంతులను మరికొన్ని బౌన్సర్లను వేసి గందరగోళానికి గురి చేశాడు. స్టోయినిస్  కూడా అలాగే కొన్ని  వదిలేశాడు  చివరికి అతను క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇలా ఎలిమినేటర్ మ్యాచ్లో హర్షల్  పటేల్ ఎంతో వైవిధ్యం చూపించాడు. గత మ్యాచ్ లలో తడబడినట్లు కనిపించినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్లో  మాత్రం ఇరగదీసాడు అంటూ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl