
ముఖ్యంగా తన తండ్రి మరణం యాంకర్ విష్ణుప్రియ తో గొడవలు ఇలా అన్నిటికీ కూడా క్లియర్ గా సమాధానాల్ని తెలిపింది రీతూ చౌదరి. యాంకర్ ఇలా ప్రశ్నిస్తూ.. బిగ్ బాస్ కి వెళ్లక ముందు వరకు ఎక్కడ చూసినా విష్ణు ప్రియ నువ్వు కలిసి తిరిగేవారు కానీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించగా.. అందుకు రీతూ చౌదరి.. ఎవరు చేంజ్ కాలేదు కేవలం కొంత గ్యాప్ తీసుకున్నాము.. నా లైఫ్ లో ఎవరూ కూడా సక్కగుండరు .. అది ఎందుకో నాకు తెలియదు.. కానీ ఎవరైనా ఏదైనా విషయాన్ని చెబితే నేను అసలు విననని తెలిపింది.. ముఖ్యంగా ఉచిత సలహాలు ఇచ్చేవారు అంటే నాకు నచ్చదని తెలిపింది.
అయితే ప్రస్తుతానికి తనకు ఎవరు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు లేరని ఫ్రెండ్ షిప్తో, రిలేషన్ షిప్ అనేవి వద్దు రా బాబు అనేలా చేశారని వాటన్నిటికీ ఒక దండం అంటూ తెలిపింది.. ఇన్ని మోసాలను తన గుండె తట్టుకోలేదని తెలియజేసింది రీతూ చౌదరి. ఇక పెళ్లి తర్వాత కూడా బ్రేకప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపింది..ముఖ్యంగా తన తండ్రి చనిపోయిన తర్వాత తన పరిస్థితులు చాలా మారిపోయాయని తన మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోందని.. ముఖ్యంగా తన తండ్రి చనిపోయినప్పుడు చాలామంది డబ్బులు ఇవ్వాలని తనని అడిగారని.. కానీ తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఎవరు అడగలేదని తెలిపింది. తన తండ్రి చనిపోయిన తర్వాత 11 రోజులు కార్యక్రమాలకి ఇంట్లో ఉన్నప్పుడు.. పాల ప్యాకెట్ల నుంచి భోజనం వరకు అన్నిటికీ డబ్బులు సొంత మనిషిలే అడగడం చాలా బాధ అనిపించిందని తెలిపింది.