ఈరోజుల్లో ఐఫోన్ కలిగి ఉండడాన్ని అందరూ ఒక రేంజ్ గా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఐఫోన్ మొబైల్ లను అప్ గ్రేడ్ చేస్తూ మార్కెట్లోకి కొత్త కొత్త మొబైల్ ని తీసుకు వస్తుంది. అయితే ఐఫోన్ 13 ఇక త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు అని టాక్ గత కొంతకాలం నుంచి వినిపిస్తుంది. అయితే అటు ఆపిల్ ఐఫోన్ సంస్థ మాత్రం ఇప్పటి వరకు తమ తదుపరి సిరీస్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇక యాపిల్ ఐఫోన్ యొక్క ఫీచర్లు ఏంటి అనే దానిపై కూడా కొన్ని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి
ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 12 బాగా క్లిక్ అయింది. 20w చార్జింగ్ స్పీడ్ ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ మార్కెట్లో టాప్ మొబైల్ గా కొనసాగుతుంది అయితే ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రాబోయే ఐఫోన్ సిరీస్లో ఏకంగా 25 వాట్ అప్గ్రేడ్ చేయబోతున్నారట. దీంతో ప్రస్తుతం ఇక ఈ వార్తలు కాస్త వైరల్ గా మారిపోయాయ్. ఐఫోన్ లవర్ అందరూ కూడా ఈ మొబైల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే యాపిల్ సంస్థ ఐఫోన్ 12 తమ వెబ్సైట్లో విక్రయిస్తుంది. 20w ఛార్జింగ్ కెపాసిటీతో ఇక ఈ మొబైల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం 25 వాట్స్ కి పెంచినప్పటికీ ఛార్జింగ్ స్పీడ్ పెద్దగా మారదు అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి