
ఈ అద్భుతం చేసింది టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న కొలోసల్ బయోసైన్సెస్ అనే బయోటెక్ కంపెనీ. వీళ్ల పని అంతరించిపోయిన జంతువుల్ని మళ్లీ బతికించడం. రీసెంట్‌గా ఈ కంపెనీ.. మూడు డైర్ వోల్ఫ్ పిల్లల్ని సక్సెస్‌ఫుల్‌గా పుట్టించిందని ప్రకటించింది.
ఈ పిల్లలకు రోములస్, రెమస్, ఖలీసి అని పేర్లు కూడా పెట్టేశారు. రోములస్, రెమస్ అక్టోబర్ 1, 2024న పుట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకే, జనవరిలో ఖలీసి కూడా జాయిన్ అయింది. ఇది సైన్స్‌లో, జంతు సంరక్షణలో ఒక బిగ్ స్టెప్. అయితే ఇది అంత సింపుల్ ప్రాసెస్ కాదు. కొలోసల్ సైంటిస్టులు.. పురాతన తోడేళ్ల అవశేషాల నుంచి డీఎన్ఏ సేకరించారు.
ఒక శాంపిల్ అయితే 13 వేల ఏళ్ల నాటి పన్ను నుంచి ఇంకోటి 72 వేల ఏళ్ల నాటి పుర్రె నుంచి తీసుకున్నారట. అడ్వాన్స్‌డ్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ పురాతన డీఎన్ఏను, మోడరన్ టెక్నాలజీని కలిపి.. హెల్తీ డైర్ వోల్ఫ్ పిల్లల్ని క్రియేట్ చేశారు. కొలోసల్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బెన్ లామ్ ఏం చెప్పారంటే.. "వేల సంవత్సరాల క్రితం కనుమరుగైన జాతిని పురాతన డీఎన్ఏతో తిరిగి తీసుకొచ్చాం. ఇది ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ లా అనిపించింది.. కానీ ఇప్పుడు నిజం." అని అన్నారు.
కొలోసల్ బయోసైన్సెస్ వాళ్లు ఈ పిల్లల అప్‌డేట్స్‌ని కొత్త యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేస్తున్నారు. ఈ గుడ్ న్యూస్‌ని Xలో పోస్ట్ చేస్తే.. 7 మిలియన్ వ్యూస్ దాటేశాయ్. ఒకప్పుడు అంతరించిపోయిన ఈ జంతువులు ఎలా పెరుగుతాయో అని ప్రపంచం మొత్తం క్యూరియస్‌గా చూస్తోంది. ఇది సైన్స్‌లో ఒక మూమెంట్ మాత్రమే కాదు.. జంతు సంరక్షణ, జెనెటిక్ రీసెర్చ్‌ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చెప్పే ఒక గ్లింప్స్.