ఇక నేటి జనరేషన్ లో పెళ్లి అనేదానికి కొత్త అర్థం చెబుతున్నారు నేటితరం యువతీ యువకులు. జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే వస్తుంది కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవాలని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.పెద్దలు నచ్చినట్టు చేసుకుంటే అందులో మజా ఏముందని కూడా కొత్తగా యూత్ ఫిలాసఫీలు కూడా చెబుతున్నారు.చెప్పటమే కాదు చేసి కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.అందుకోసమే పెళ్లిలో వింత వింత చేష్టలు చేస్తున్నారు.మండపంలోనే ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, డ్యాన్సులు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతటితో అయిపోయిందా ఇలాంటి కళాఖండాలు ఇంకా చాలా ఉన్నాయి.అయితే, పెళ్లిళ్లలో అబ్బాయిల కంటే అమ్మాయిల హవానే ఎక్కువగా ఉంటోంది. పాత కాలంలో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ మండపంలోకి వచ్చేది.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.ఎక్కడ చూసిన పెళ్లి కూతుర్లే డాన్స్ చేసుకుంటూ మండపంలోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.ఇక తెలంగాణలో ఇలా పెళ్లి కూతుర్లు డాన్స్ చేసే కల్చర్ బాగా పెరిగిపోయింది.


తాజాగా ఓ పెళ్లి కూతురు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పద్ధతిగా పెళ్లి దుస్తుల్లో ఉన్న అమ్మాయి డంబెల్స్ చేతబట్టి వర్కౌట్స్ చేస్తున్న వీడియో అయితే సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఏ అమ్మాయి పెళ్లికి తయారవ్వడం చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే కొందరుమాత్రం అమ్మాయి జిమ్ చేయడం చూసి వింతైన కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లికి ముందే వర్కౌట్స్ చేస్తుందంటే తరువాత అబ్బాయికి మూడినట్టేనా..అని కొందరు అంటుండగా.. మరికొందరు అత్తమామలకు తరువాత చుక్కలు కనిపించడం ఖాయం అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఏదేమైనా పెళ్లికూతురు జిమ్‌లో వర్కౌట్స్ చేయడం అందరినీ మెస్మరైజ్ చేసిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: