ఈ మధ్య కాలంలో ఫుడ్ బిజినెస్ ను పెంచుకోవడం కోసం కొత్త కొత్త ఐడియాలు చేస్తున్నారు.. అలాంటి వాటికి సంబందించిన వీడియోలు,ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అందరు తినే వాతావరణంను అందంగా ముస్తాబు చేస్తే మరి కొంత మంది వెరైటీ వంటలను చేస్తూ జనాల కు పిచ్చెక్కిస్తున్నారు.. ఇలాంటివి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి.. అయితే వాటిని తల తన్నేలా ఇప్పుడు ఓ వ్యక్తి చేసిన పనికి జనాలు ఫిధా అవుతున్నారు. అంతేకాదు అతని ఐడియాకు జనాలు బ్రహ్మ రథం పడుతున్నారు..



మీరు ఫ్లెక్సీలు, లోగోలు, హోల్డింగ్స్ లాంటి ద్వారా తమ ఫుడ్స్‌ను ప్రమోట్ చేసుకున్న సంస్థల ను చూసి ఉంటారు. అయితే మీరెప్పుడైనా ఫుడ్‌పైనే ముద్రించి.. పబ్లిసిటీని పెంచుకోవడం చూశారా.? అవునండీ.. ఇక్కడ అలాంటి వారి గురించే చెప్పబోతున్నాం. సమోసా విక్రయదారుడు.. తన క్రియేటివిటీకి పదునుపెట్టి.. ఏయే వెరైటీలు ఉన్నాయో అందరికీ తెలియజేశాడు. అతడు ఎంచుకున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతోంది. ఇంటర్నెట్‌లో బెంగళూరుకు చెందిన ఓ నెటిజన్ సమోసాల ఫోటోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. 



ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వాటిపై కోడ్స్ ఉండటమే విశేషం.తాను 'సమోసా పార్టీ' అనే రెస్టారెంట్ నుంచి వీటిని ఆర్డర్ చేశానని.. ఇక ఇలా సమోసాలపై కోడ్స్ ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అతడు పేర్కొన్నాడు. ఇక ఆ కోడ్స్‌ ఎందుకు ముద్రించారన్న ఆసక్తి తో.. సదరు రెస్టారెంట్‌ను ఆ నెటిజన్ అడిగాడట. 'సమోసాల్లో ఆలు, ఆనియన్, చికెన్, మటన్, కార్న్, నూడిల్స్.. అని రకాల వెరైటీలు తమ దగ్గర ఉండటం తో.. వాటిని కస్టమర్లు గుర్తించడానికి ఈ కోడ్స్ ఉపయోగపడతాయని' ఆ రెస్టారెంట్ సమాధానం ఇచ్చిందట..ఇదేదో బాగుందని ఆ సమోసాలను జనం ఎగబడి కొంటున్నారు..మీరు ఆ సమోసాలను ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి: