
చాలామంది ఇళ్లల్లోని ఆడవాళ్లు గిన్నెలు శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లు వడవాలి అని.. గిన్నెలను బోర్లిస్తూ ఉంటారు. ప్లేట్స్.. గిన్నెలు.. దబర్లు.. అండాలు.. స్పూన్లు ఇలా ఏ సామాన్లు తోమినా సరే ఆరు బయట గాని సింకు కు పక్కన గాని ఏదైనా ఒక ట్రే లో కానీ ఆడవాళ్లు గిన్నెలు తోమేసిన తర్వాత ఆ గిన్నెలను బోర్ల పరుస్తూ ఉంటారు . తద్వారా నీరు పోతుంది..అలాగే గిన్నెలు ఆరిపోతాయ్ . అయితే ఇది వాస్తు ప్రకారం తప్పు అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు. అన్ని గిన్నెలు బోర్లించిన పర్వాలేదు కానీ తవా, బాండిల్(కడాయ్) మాత్రం అసలు బోర్లించకూడదు అంటున్నారు .
అలా బోర్లిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట . అంతేకాదు ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉంటాయట . బాండిల్ ని అసలు బోర్లించకూడదట . తవా ని కూడా తోమేసిన తర్వాత బోర్లించకూడదట . వాటిని స్ట్రైట్ గానే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలట .మిగతా ఏ గిన్నేలు అయిన సరే తోమేసిన తర్వాత బోర్ల వేసుకున్న తప్పులేదు కానీ అదేవిధంగా తవాను బోర్ల వేసి ఆరబెడితే మాత్రం ఉన్న సంపద మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది అని .. ఆ ఇంట్లో కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అని ఉన్న సంతోషం కూడా ఏదో ఒక కారణంగా పోతుంది అంటూ వాస్తు శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు. కాబట్టి మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వాస్తు శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు..!!
నోట్ : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఈ సమాచారం పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పాఠకులు వ్యక్తిగత అభిప్రాయం పై ఆధార పడి ఉంటుంది.