సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువతలో కొందరు చేసే పిచ్చి పనులు మరింతగా పెరిగాయి. వీరిలో చాలామంది పాపులారిటి కోసం, కొన్ని నిమిషాల వైరల్ క్రేజ్ కోసం మానవత్వాన్ని మరచి క్రూరకార్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హనీపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన దీనికి తాజా ఉదాహరణ. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ, నెటిజన్లలో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బతికే ఉన్న రెండు నాగుపాములను  కట్టితో గడ్డి కుప్పలో పడేసి దారుణంగా మంటలు పెట్టి తగలబెట్టడం వంటి ఆందోళనకర దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.


 మంటల్లో చిక్కుకున్న పాములు ప్రాణం కోసం తల్లడిల్లుతూ చివరికి ప్రాణాలు కోల్పోయిన ఆ దృశ్యాలను చూసి ప్రజలు ఆగ్రహావేశాలతో సోషల్ మీడియాలో అతనిపై మండిపడుతున్నారు. “నీకు బుద్ధి లేదా? కడుపు కి అన్నం నే గా తింటున్నావ్..దుర్మార్గుడివి!” అంటూ తీవ్రంగా తిడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు వెంటనే చర్యల్లోకి దిగారు. ఇండియన్ కోబ్రా పాము వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972 ప్రకారం షెడ్యూల్-1లో రక్షిత జాతిగా గుర్తించబడింది. కాబట్టి ఈ ఘటన చట్టపరంగా కూడా చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడింది.



వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించిన అటవీశాఖ సిబ్బంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు సెక్షన్ 9, 39, 51 కింద నమోదు అయింది. ఈ నేరానికి గరిష్టంగా ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. “ఇలాంటి క్రూరకార్యాలు చేసేవారికి కఠినమైన శిక్షలు తప్పనిసరి. చట్టపరమైన శిక్షలు మాత్రమే కాకుండా సామాజికంగా కూడా వీరిని కఠినంగా ప్రశ్నించాలి,” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఈ నాగుపాములు మానవులకు హాని చేయకుండానే ప్రకృతిలో తన సహజ జీవితాన్ని గడుపుతున్నాయి. అలాంటి జంతువులను ఇలాగే మంటల్లో వేసి చంపడం మానవత్వానికి మచ్చ” అని జంతు హితసంస్థలు కూడా ఘోరంగా ఖండిస్తున్నాయి.



పీఠా ఇండియా వంటి జంతు సంరక్షణ సంస్థలు ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశాయి. అనంతరం హనీపూర్ జిల్లా పరిధిలోని చిత్రకూట్ మండలంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటుచేసి వెంటనే చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
సమాజంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ఇలాంటి ఘోర చర్యలు చేయడం చాలా పెద్ద నేరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. నెటిజన్లు కూడా “ఇలాంటి వారిని నడిరోడ్డుపై కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగవు,” అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి మానవత్వం చచ్చిపోయిందన్న ఆలోచన కలిగిస్తోంది. జంతువులు మానవులపై దాడి చేయకపోతే, మనుషులు ఎందుకు వాటిని ఇంత క్రూరంగా హింసించాలి? ప్రకృతి సృష్టించిన ప్రతి జీవికి తనదైన స్థానం ఉందని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!



https://www.instagram.com/reel/DN5J-rDDnbd/?utm_source=ig_web_copy_link


మరింత సమాచారం తెలుసుకోండి: