వంకాయ రసం ఎప్పుడైనా చేసుకున్నారా ? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ? ఇన్నాళ్లు గుత్తి వంకాయ కూర, వంకాయ మసాలా, వంకాయ చట్నీ, వంకాయ ఫ్రై ఇలా ఎన్నో చేసుకొంటారు.. అలానే వంకాయ రసం కూడా. అయితే వంకాయ రసం తినాలి అని ఉన్న ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. వారికోసమే ఈ వంకాయ రసం రెసిపీ. ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కావలసిన పదార్థాలు.. 


పెద్ద వంకాయ - 1, 


టమోటో - 1, 


చింతపండు - నిమ్మకాయంత, 


కొత్తిమీర తరుగు - అలంకరణకు సరిపడా, 


పసుపు - పావు టీ స్పూను, 


ఇంగువ - చిటికెడు, 


ఉప్పు - రుచికి తగినంత, 


దనియాలు - 2 టేబుల్‌ స్పూన్లు, 


జీలకర్ర - 1 టీ స్పూను, 


మిరియాలు - 1 టీ స్పూను, 



ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, 


నూనె - 1 టేబుల్‌ స్పూను, 


ఆవాలు, 



కరివేపాకు, 


నెయ్యి - తిరువాతకు సరిపడేంత.


తయారీ విధానం.. 


వంకాయకు నూనె రాసి మంటపైన కాల్చి మెదిపి పెట్టుకోవాలి. నూనెలో దనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి వేసి కొద్దిసేపు వేయించి పొడిచేసి చివర్లో అరముక్క టమోటా వేసి పేస్టులా రుబ్బుకోవాలి. కడాయిలో తాలింపు వేగాక పసుపు, చిదిమిన టమోటా ముక్క, రుబ్బుకున్న పేస్టు, మెదిపిన వంకాయ, చింతపండు గుజ్జు, ఉప్పు కలిపి రెండు నిమిషాల తర్వాత గ్లాసు నీరు పోయాలి. రసం రెండు పొంగులు వచ్చాక కొత్తిమీర వేసి దించేయాలి. అంతే నోరూరించే వంకాయ రసం రెడీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: