కావలిసినవి : కాటేజ్ చీజ్ : 250 గ్రా. పాలు : వంద ఎంఎల్ మైదా : డబ్బైఐదు గ్రా. బేకింగ్ పౌడర్ : అరచెంచా కోడిగుడ్లు : రెండు కాస్టర్ షుగర్ : టేబుల్ స్పూను వెనిల్లా ఎసెన్స్ : నాలుగైదు చుక్కలు  వెన్న : కొద్దిగా ఫిగ్స్ : నాలుగు(ముక్కల్లా తరగాలి) తేనె : కొద్దిగా తయారీ చేసేవిధానం : ముందు చీజ్ ను మక్సీలో వేసి తిప్పాలి. ఆ తర్వాత వెన్న, గుడ్డు సొన తప్ప మిగిలిన పధార్థాలన్నీ కూడా మిక్సీలో వేయాలి. పిండి తయారయ్యాక ఓ గిన్నెలోకి మార్చుకోవాలి. ఆ తరువాత గుడ్డులోని తెల్లసొనను తీసుకుని బాగా గిలక్కొట్టి పిండిలో కలపాలి.  పేనం వేడి చేసి కొద్దిగా రాసి పిండిని వరిచి కాల్చాలి. రెండువైపులా తిప్పి కాల్చితే నోరూరించే హనీ పాన్ కేకులె రెడీ...  

మరింత సమాచారం తెలుసుకోండి: