అమెరికా దేశానికి చెందిన మోటార్ బైక్ సంస్థ కు చెందిన ఇండియన్ మోటర్ సైకిల్ కొత్త టెస్ట్ రైడ్ పోటీని ప్రకటించింది. అందులో గెలుపొందిన వ్యక్తులకు వచ్చే సంవత్సరం యూరప్ ప్రయాణాన్ని అందించనుంది. ఇందుకోసం బైక్ రైడర్స్ చేయాల్సింది కేవలం సెప్టెంబర్ 30 వ తేదీ లోపు వారికి దగ్గరలోని డీలర్ షిప్ లో ఏదైనా ఇండియన్ మోటర్ బైక్ ను పరీక్షించి వాటిని టెస్ట్ డ్రైవ్ చేయడం ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు. అయితే ఇందుకోసం రైడర్స్ ఓ చిన్న పని చేసి పెట్టాలి.

 


ఈ కాంపిటీషన్ లో ఎవరైతే పాల్గొనాలని అనుకునేవారు, వారు సందర్శించిన డీలర్ షిప్ ట్యాగ్ చేయడంతోపాటు, మోటార్ సైకిల్ తో వారు తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసేటప్పుడు కచ్చితంగా #Indian TestRide అనే హాష్ టాగ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలాంటి చిత్రాలను కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంటారు. వారు సరైన హ్యాష్ ట్యాగులు ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాలపై తనిఖీ చేస్తూ ఉంటారు.

 


ఇలా సోషల్ మీడియాలో వారి కంపెనీకి చెందిన బైకులను ట్రై చేయడం ద్వారా కలిగే అనుభవాలను, సరైన హ్యాష్ టాగ్స్ ను ఉపయోగించి వారు దిగిన ఫోటోలను జతచేస్తూ పోస్ట్ చేసిన వారందరిలో ఓ నలుగురు విజేతలను ఎంపిక చేసి వచ్చే సంవత్సరంలో వారిని యూరప్ ట్రిప్ కు పంపించడం జరుగుతుంది. ఇక ఇందులో గెలిచిన విజేతలకు సంస్థ వెళ్లి తిరిగి రావడం ఖర్చులతో సహా నాలుగు రోజుల వసతి కల్పించడంతోపాటు ఓ భారతీయ మోటార్ బైక్ ను అందించి రెండు రోజుల ప్రయాణం కోసం టూర్ గైడ్ కూడా వారికి అందజేయనుంది. 

 


ఇక ఈవెంట్ ను కవర్ చేయడానికి వారితో పాటు కొంతమంది ఫోటోగ్రాఫర్ లను, వీడియో గ్రాఫర్ లను కూడా ఏర్పాటు చేయనుంది సంస్థ. ఇప్పటికే అనేకమంది రైడర్లు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు కూడా. ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన ఇండియన్ మోటార్ సైకిల్ టెస్ట్ రైడర్ కాఫీ కప్పులను అందజేస్తున్నారు కంపెనీవారు. ఇకపోతే ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి బిఎస్ 6 మోటర్ బైక్స్ కరోనా నేపథ్యంలో విడుదల చేయలేదు. అంతేకాదు ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయాన్ని కూడా తెలపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: