బైక్ ప్రియులకు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన వాటిని కొనాలని, డ్రైవ్ చేయాలని చాలా ఆసక్తిగా ఉంటుంది.. అయితే ఏ బైక్ కొనాలో ఐడియా లేకపోవడంతో ఆశలను వదిలేస్తున్నారు..అలాంటి వారికి హోండా కంపెనీ సరికొత్త ఫీచర్లతో కొత్త బైక్ ను లాంఛ్ చేసింది..ఆ బైక్ హోండా యాక్టివా యానివర్సరీ కి సీక్వెల్ గా వచ్చింది. ఆ బైక్ హోండా యాక్టివా యానివర్సరీ ఎడిషన్.. హోండా కంపెనీని స్థాపించి దాదాపు ఇరవై ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఈ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..



బైక్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..స్కూటర్లలో అత్యుత్తమ విక్రయాలు అందుకున్న మోడల్ హోండా యాక్టివా. ప్రస్తుతం ఆరో తరం యాక్టీవా మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉంది..యానివర్సరీ ఎడిషన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ యాక్టివా 6జీ మోడల్ కు చెందినది. ఈ సరికొత్త హోండా యాక్టివా 6జీ 2020 మోడల్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. అదే స్టాండర్డ్, డీలక్స్. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ.66,816లుగా సంస్థ నిర్దేశించింది. రెండో మోడల్ ధర వచ్చేసి రూ.68,316లుగా కంపెనీ నిర్ణయించింది..



సరికొత్త ఫీచర్లతో , కొత్త టెక్నాలజీ తో ఈ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.వైట్, గోల్డ్, స్ట్రిప్స్, రన్నింగ్ ఎంటైర్ లెంజ్ స్కూటర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ 20 ఇయర్ యానివర్సరీ ఎడిషన్ పిల్లియన్ గ్రాబ్ రెయిల్స్ తో పాటు మ్యాచే మెచ్యూర్ బ్రౌన్ కలర్ స్కీముతో అందుబాటులోకి వచ్చింది. ఈ యానివర్సరీ ఎడిషన్ బ్లాక్ ఫినిష్డ్ స్టీల్ వీల్స్ తో పాటు బ్లాక్ సీటు కలర్స్ తో మార్కెట్ లోకి వచ్చింది.బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ మోడల్ 109సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. 20 సంత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్బంగా ఈ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. విడుదల అయిన తొలి నాళ్ళలోనే భారీగా సెల్ అవ్వడంతో కంపెనీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: