ఇండియన్ మార్కెట్ లోకి రోజుకో కొత్త మోడల్ బైక్ విడుదల అవుతుంది. విడుదల అయిన ప్రతి బైక్ కూడా యువతను ఆకట్టుకుంటుంది. తాజాగా మార్కెట్ లోకి మరో బైక్ లాంఛ్ అయింది. కేటీఎం డ్యూక్ 125 బైక్ ను కంపెనీ తాజాగా లాంఛ్ చేసింది. ఈ బైక్ ప్రారంభ రేటు వచ్చేసి మార్కెట్ లో  రూ.1.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.సరికొత్త డిజైన్, ఫీచర్లు, అప్డేట్లతో వచ్చిన టూ-వీలర్ ముందు మోడళ్ల కంటే ఆకర్షణీయంగా ఉంది.ఈ ఎంట్రిలెవల్ డ్యూక్ 125 బైక్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేటీఎం డీలర్ల వద్ద దీన్ని బుక్ చేసుకోవచ్చు..



బైక్ ను బుక్ చేసుకున్న కొద్ది రోజులకే డెలివరీ అవుతుంది..ఈ బైక్ కు అంత డిమాండ్ రావడానికి గల ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. MY21 డ్యూక్ 125 మోటార్ సైకిల్లో చాలా మార్పులు వచ్చాయి.. సరికొత్త ఫీచర్లతో, స్టైలిష్ లుక్ తో , అందుబాటు ధర తో ఈ బైక్ అందరినీ ఆకట్టుకుంటుంది. 1290 సూపర్ డ్యూక్ మోడల్ డిజైన్ ను దీనికి ఉపయోగించినట్లు సంస్థ పేర్కొంది. ఇక్కడ అందరిని ఆకట్టుకుంటున్న విషయమేంటంటే.. 13.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉన్నా కూడా స్టైల్ లుక్ తో ఆకట్టుకుంటుంది..



కేటీఎం డ్యూక్ 125 మోటార్ సైకిల్లో 125సీసీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉండి 14.3 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 12ఎన్ఎం టార్క్ ను జెనరేట్ చేస్తుంది. అది కాక,6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. పూర్తిగా పునరుద్ధరించిన ఈ మోటార్ సైకిల్ భారత మార్కెట్లోఅతిపెద్ద డిస్ ప్లేస్ మెంట్ సిబ్లింగ్ గా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ బైక్ కలర్, లుక్,  స్టైల్ ఆకట్టుకోవడంతో చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. ఈ బండికి పోటీగా బజాజ్ పల్సర్ 125  బైక్ ఉంది. ఈ బైక్ అందరికి కంఫర్ట్ గా ఉండటంతో అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇప్పటికే సేల్స్ భారీగా పెరిగాయని కంపెనీ యాజమాన్యం అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: