ఇక చాలా మంది కూడా రకరకాల చర్మ సమస్యలతో బాధ పడుతూ వుంటారు. వాటికి రకరకాల క్రీములు వాడుతూ వుంటారు. అయితే ఇంజక్షన్స్ వలన కూడా ఈ చర్మ సమస్యలని తగ్గించుకొని మనం మార్పు తీసుకురావచ్చు. ఇలా ఇంజెక్షన్ల వల్ల కూడా పిగ్మెంటేషన్ సమస్య ఇంకా స్కార్స్ వంటివి కూడా ఈజీగా తొలగిపోతాయి. ఇక విటమిన్ సితో పాటు మెసో థెరపీ కూడా సాధారణంగా చేస్తూ ఉంటారు. ఇక అదే విధంగా ట్రాన్ ఎక్సమిక్ ఆసిడ్ ఇంకా ఇతర లైట్నింగ్ అలాగే బ్రైట్ ఏజెంట్స్‌తో కూడా ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.అలాగే సర్జరీ కాకుండా కూడా కొన్ని ప్రాసెస్‌లు ఉన్నాయి. చర్మం ఇంకా జుట్టుకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక చర్మానికి లేదా తలకి హ్యాలురోనిక్‌ యాసిడ్, విటమిన్స్ ఇంకా మినిరల్స్ అలాగే ఇతర పదార్ధాలని ఇస్తాయి. ఇక దీని కారణంగా ఇది పని చేయడం జరుగుతుంది. అయితే చిన్న చిన్న ఇంజెక్షన్లని ముఖం, మెడ ఇంకా తల భాగంలో ఇస్తారు. అలానే స్పెషల్ విటమిన్స్ ఇంకా పోషకాలు వలన కేవలం చర్మం వైట్‌గా రావడం మాత్రమే కాకుండా కాంప్లెక్షన్ కూడా మారడం జరుగుతుంది.అలాగే స్కిన్ కంప్లెక్షన్ ఇంకా ఎలాస్టిసిటీ కూడా పెరుగడం జరుగుతుంది. "Silk peel dermalin fusion" కూడా చర్మానికి ఎక్స్‌ఫోలియెట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది స్కిన్ ని బాగా బ్రైట్‌గా ఉంచుతుంది. ఇంకా యాక్నే సమస్యని కూడా ఈజీగా తొలగిస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఓరల్ సన్ స్క్రీన్, కెరోటినాయిడ్స్ ఇంకా ట్రాన్ ఎక్సమిక్ యాసిడ్ అలాగే విటమిన్ సి కూడా బాగా పని చేస్తాయి. యువిఏ ఇంకా యువిబి కలిగిన మంచి సన్ స్క్రీన్‌ని వాడటం ఇంకా ఇన్ఫ్రారెడ్ ప్రొటెక్షన్ రెగ్యులర్ గా వాడితే చాలా మంచిది.ఇక టోపికల్ విటమిన్ సి కనుక రోజు వాడితే బాగుంటుంది. ఇలా వివిధ పద్ధతులను ఉపయోగించి పిగ్మెంటేషన్‌ సమస్యని తొలగించవచ్చు.అలాగే ఇవి చాలా సులభం కూడా. ఇక ఏది ఏమైనా కూడా సన్ రేస్‌కి మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్‌లో అసలు ఉండకండి. ఇక అలానే బయటకి వెళ్ళినప్పుడు సన్ రేస్ అనేవి డైరెక్టుగా మీ మీద పడకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఇంకా స్కార్ఫ్ కట్టుకోవడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. దీనితో మీకు ఎలాంటి చర్మ సమస్యలు అనేవి లేకుండా ఇంకా రాకుండా ఉండచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: