తెలంగాణ‌లో ప్ర‌స్తుతం క‌రోనా జోరు తీవ్రత దృష్ట్యా ఇప్ప‌ట్లో లాక్‌డౌన్ ఎత్తివేసే ప్ర‌శ‌క్తే లేద‌ని సీఎం కేసీఆర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఆదివారం కేబినెట్ భేటీ త‌ర్వాత జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యం చెప్పేశారు. దేశంలో కేంద్రం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింద‌ని.. అయితే తెలంగాణ‌లో మాత్రం ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌వ‌ని కేసీఆర్ తేల్చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌డ‌లింపులు రాష్ట్రంలో అమ‌లు కావ‌ని చెప్పారు. తెలంగాణ‌లో క‌రోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

 

అయితే నిత్యావ‌స‌రాలు, మందులు, ఫార్మా కంపెనీలు, వ్యవ‌సాయ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి గ‌తంలోనే కొన్ని మిన‌హాయింపులు ఇచ్చామ‌ని.. వీటికి ఇప్పుడు కూడా మిన‌హాయింపులు కొన‌సాగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇక తెలంగాణలో మ‌న‌మంద‌రం ఇదే నిబంధ‌న‌లు పాటిస్తే మే 1వ తేదీకి క‌రోనా పూర్తిగా క‌ట్ట‌డి అవుతుంద‌ని కేసీఆర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: