ప్ర‌శాంతంగా ఉన్న హుజురాబాద్ బీజేపీలో కొద్దిరోజులుగా వ‌ర్గ‌పోరు రాజుకుంటుంది.టీఆర్ఎస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ నెల రోజుల‌పాటు అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించి నిన్న బీజేపీలో చేరారు.అయితే హుజురాబాద్‌లో బీజేపీకీ పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఇన‌గాల పెద్దిరెడ్డి ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్‌ను బీజేపీలో చేర్చుకోవ‌డాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించారు. రాష్ట్రంలోని బీజేపీ పెద్ద‌లంతా నిన్న ఢిల్లీ వెళ్తే పెద్దిరెడ్డి,ఆయ‌న అనుచ‌రులు ఎవ‌రు వెళ్ల‌లేదు.అయితే ఈ రోజు పెద్దిరెడ్డి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈట‌ల బీజేపీలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ఉంటుంద‌నే దానిపైనే చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.మ‌రి పెద్దిరెడ్డికి అధిష్టానం హామీ ల‌భించ‌కపోతే టీఆర్ఎస్ వైపు వెళ్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp