సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌తో వివాదాల నేపథ్యంలో ఇంతకీ అసలు ఈ ఆర్మీ చీఫ్ నరవణె ఏమంటున్నారు.. భవిష్యత్తులో శత్రుదేశాలతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని, అందుకు సంబంధించి ఇప్పటికే అనేక ట్రైలర్లు చూస్తున్నామని నరవణె చెప్పారు. చైనా, పాక్ పేర్లను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే వినూత్నమైన భద్రతా సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.
ఇటీవల దేశంలో ఏర్పడిన పరిస్థితులు నుంచి మరింత సమర్థమైన సైన్యం కావాలన్న అవసరాన్ని ఈ ప్రయోగాన్ని గుర్తు చేశాయని అంటున్నారు. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్ నిర్వహించిన సెమినార్‌లో ఈ మేరకు నరవణె తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైన్యం పునర్‌వ్యవస్థీకరణపై ఇప్పటికే దృష్టి సారించినట్లు చెప్పారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల ఘర్షణను గుర్తుచేసిన నరవణె.. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖాముఖి పోరు సహా.. అన్ని రకాలుగా శత్రువుపై పోరాడగల సామర్థ్యాన్ని పెంపొందుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి